మహిళలను తొక్కుకుంటూ కౌన్సిల్ హాల్లోకి... మరో వివాదంలో ఎమ్మెల్యే అంబటి
గుంటూరు: చెత్తపై పన్ను విధించడం, ఆస్తి పన్ను పెంపును నిరసిస్తూ ఆందోళనకు దిగిన సిపిఎం శ్రేణులతో వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు దారుణంగా వ్యవహరించారు.
గుంటూరు: చెత్తపై పన్ను విధించడం, ఆస్తి పన్ను పెంపును నిరసిస్తూ ఆందోళనకు దిగిన సిపిఎం శ్రేణులతో వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు దారుణంగా వ్యవహరించారు. సత్తెపల్లి మున్సిపల్ కార్యాలయంలోకి ఎమ్మెల్యేను వెళ్లనివ్వకుండా నిరసనకారులు అడ్డుగా కూర్చోగా... వారిని తొక్కుకుంటూ ఆయన ముందుకు వెళ్లారు. మహిళలు అనికూడా చూడకుండా నిరసనకారులను పక్కకు తోస్తూ, కాళ్లతో తొక్కుకుంటూనే ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు కూడా ముందుకు వెళ్లారు. అధికారపార్టీ ఎమ్మెల్యే అంబటి తీరుపై సిపిఎం నాయకులు మండిపడుతున్నారు.
సిపిఎం నాయకుల నిరసనలతో సత్తెనపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిరసనకారులను అడ్డుకోడాని పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే సిపిఎం నాయకులు, పోలీసులకు మద్య వాగ్వాదం జరిగింది. దీంతో నిరసనకు దిగినవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.