రూ.7లక్షలు తస్కరించి... రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఘరానా దొంగ
సిరిసిల్ల: ఇంటి స్థలం కనుగోలు కోసం దాచిన రూ.7 లక్షల నగదును తస్కరించేందుకు ప్రయత్నించిన ఘరానా దొంగను పట్టుకుని దేహశుద్ది చేశారు స్థానికులు.
సిరిసిల్ల: ఇంటి స్థలం కనుగోలు కోసం దాచిన రూ.7 లక్షల నగదును తస్కరించేందుకు ప్రయత్నించిన ఘరానా దొంగను పట్టుకుని దేహశుద్ది చేశారు స్థానికులు. ఈ ఘటన సిరిసిల్ల పట్టణంలోని పద్మానగర్ లో చోటుచేసుకుంది. పద్మానగర్ లో నివాసముండే ఓ వ్యక్తి ఇంటిస్థలం కొనుగోలు కోసం బ్యాంక్ నుండి డబ్బును తీసుకువచ్చి ఇంట్లో దాచాడు. ఈ విషయం ఆ ఇంటిపక్కనే అద్దెకుంటున్న దొంగకు తెలిసింది. ఇంకేముంది ఆ ఇంట్లోవారు బయటకు వెళ్లిన సమయంలో అర్థరాత్రి పూట ఇంట్లొకి చొరబడ్డాడు. డబ్బు మొత్తాన్ని మూటగట్టుకుని వెళ్తుండగా కరెక్ట్ గా అదే సమయంలో ఇంటి యజమానులు వచ్చారు. దీంతో దొంగ వారిని తప్పించుకుని పారిపోతుండగా స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ది చేశారు. అతడే దోచిన సొత్తును స్వాధీనం చేసుకుని దొంగను పోలీసులకు అప్పగించారు.