దక్షిణ భారతంలో మొట్టమొదటి కోతుల సంరక్షణ కేంద్రం...ప్రారంభించిన మంత్రి ఆలోల్ల

గండి రామన్న హరిత వనంలో కోతుల సంరక్షణ,  పునరావాస కేంద్రం,  మూషిక జింకల పార్కు,  చైన్ లింక్, సఫారీ, గజీబో, ఎకో హట్స్, చిన్న పిల్లల కోసం బోటింగ్ అభివృద్ది పనులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.

First Published Dec 20, 2020, 3:20 PM IST | Last Updated Dec 20, 2020, 3:20 PM IST

గండి రామన్న హరిత వనంలో కోతుల సంరక్షణ,  పునరావాస కేంద్రం,  మూషిక జింకల పార్కు,  చైన్ లింక్, సఫారీ, గజీబో, ఎకో హట్స్, చిన్న పిల్లల కోసం బోటింగ్ అభివృద్ది పనులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరిత వనంలో సఫారీ వాహనాన్ని నడిపారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఈ కార్యక్రమంలో జిల్లా  కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

రూ. 2.25 కోట్ల వ్యయంతో కోతుల సంరక్షణ, పునరావాస కేంద్రంఏర్పాటుచేస్తున్నారు. ఇది దేశంలోనే రెండ‌వ‌ది కాగా రాష్ట్రంలో తొలి పునరావాస శిబిరం. అలాగే అర ఎకరం విస్తీర్ణంలో రూ. 8 లక్షల వ్యయంతో మూషిక జింకల పార్కు ఏర్పాటుచేస్తున్నారు. రూ.2.65 కోట్ల వ్యయంతో హరిత వనం పార్కులో అభివృద్ది పనులు చేస్తున్నారు.