మునుగోడు ఉపఎన్నికకు రంగం సిద్దం... రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు వెంటనే స్పీకర్ ఆమోదం

హైదరాబాద్ : తెలంగాణలో మరో ఉపఎన్నికకు రంగం సిద్దమయ్యింది.

First Published Aug 8, 2022, 11:58 AM IST | Last Updated Aug 8, 2022, 11:58 AM IST

హైదరాబాద్ : తెలంగాణలో మరో ఉపఎన్నికకు రంగం సిద్దమయ్యింది. కాంగ్రెస్ పార్టీని వీడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరేందుకు సిద్దమై ఇవాళ (సోమవారం) మునుగోడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసారు. ఆయన రాజీనామాను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడి వెంటనే ఆమోదించారు. దీంతో మునుగోడు అసెంబ్లీ స్థానం ఖాళీ కావడంతో తెలంగాణలో మరో  ఉపఎన్నిక అనివార్యమయ్యింది. మొదట అసెంబ్లీ ఎదురుగా వున్న గన్ పార్క్ కు చేరుకున్న రాజగోపాల్ రెడ్డి అమరవీరులకు నివాళులు అర్పించారు. అక్కడి నుండి నేరుగా అసెంబ్లీకి చేరుకుని స్పీకర్ ను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందించారు. స్పీకర్ ఫార్మాట్ లో రాజగోపాల్ రెడ్డి రాజీనామా వుండటంతో అసెంబ్లీ  స్పీకర్ కూడా వెంటనే దాన్ని ఆమోదించారు.