Asianet News TeluguAsianet News Telugu

ఆ నాలుగు నియోజకవర్గాలకూ కాళేశ్వరం నీరు... అధికారులకు మంత్రి హరీష్ ఆదేశాలు

 సంగారెడ్డి, ఆందోళ్, నారాయణ ఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాలకు సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్టుల ద్వారా సాగు నీరందేలా ప్రణాళికలు తయారు చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు 

 సంగారెడ్డి, ఆందోళ్, నారాయణ ఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాలకు సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్టుల ద్వారా సాగు నీరందేలా ప్రణాళికలు తయారు చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు నీటిపారుదల శాఖ  అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లోని అరణ్య భవన్ లో సంగారెడ్జి, మెదక్ జిల్లా నీటి పారుదల శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కొమరవెళ్లి మల్లన్న సాగర్ నుండి కాలువల ద్వారా సింగూరు ప్రాజెక్టుకు వచ్చే నీటిని సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణ ఖేడ్, ఆందోళ్ నియోజవర్గాలకు తరలించేందుకు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. దీని ద్వారా దాదాపు 2.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందనుందని మంత్రి చెప్పారు.