పక్కా పల్లెటూరి స్టైల్లో మంత్రి దయన్న... లుంగీ, బనియన్ తోనే వీధుల్లోకి...
వరంగల్: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం హనుమాన్ తండాలో పల్లె నిద్ర చేపట్టారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
వరంగల్: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం హనుమాన్ తండాలో పల్లె నిద్ర చేపట్టారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. లుంగీ, బనియన్ తోనే తెల్లవారుజాము నుంచి 8.30 గంటల వరకు గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. ఈ క్రమంలోనే స్థానిక ప్రజలను పరామర్శించి వారి సమస్యలు తెలుసుకున్నారు మంత్రి. మంత్రితో పాటు మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.