లాక్ డౌన్ టైమ్ లో పోలీసులు ఆపారని... నడిరోడ్డుపై పడుకుని నిరసన
జగిత్యాల: లాక్ డౌన్ సమయంలో పోలీసులు తనపట్ల కఠినంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ ఓ వ్యక్తి రోడ్డుపై పడుకుని నిరసన తెలిపాడు.
జగిత్యాల: లాక్ డౌన్ సమయంలో పోలీసులు తనపట్ల కఠినంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ ఓ వ్యక్తి రోడ్డుపై పడుకుని నిరసన తెలిపాడు. లాక్ డౌన్ కొనసాగుతుండగానే రోడ్డుపైకి వచ్చిన చల్ గల్ గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి వాహనాన్నా పోలీసులు ఆపారు. అయితే అతడు హాస్పిటల్ కు వెళుతున్నానంటూ ఓ రశీదు చూపించాడు. కానీ అది అదేరోజు రశీదు కాకపోవడంతో పోలీసులు అతడి బైక్ ను సీజ్ చేశారు. దీంతో తాను హాస్పిటల్ నుండి వస్తున్నానని చెప్పిన పోలీసులు దారుణంగా వ్యవహరించారంటూ రోడ్డుపైనే మండుటెండలో పడుకుని నిరసన తెలిపాడు. దీంతో అతని సమస్య విన్న డిఎస్పి బైక్ తిరిగివ్వాలని పోలీసులను ఆదేశించారు. దీంతో అతడి బైక్ తిరిగిచ్చేశారు.