ఐక్య వేదిక ఏర్పాటు కోసమే ప్రయత్నం: ఈటలతో భేటీ అనంతరం కొండా విశ్వేశ్వర్ రెడ్డి
హైదరాబాద్: రాజకీయ కక్షతోనే మంత్రివర్గం నుండి ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేశారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్: రాజకీయ కక్షతోనే మంత్రివర్గం నుండి ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేశారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. అకారణంగా ఆయన మీద చర్యలు తీసుకోవడంతో మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి ఇవాళ(గురువారం) భేటీ అయినట్లు... రాజకీయాలు చర్చించలేమని తెలిపారు. అయితే ఐక్య వేదిక కోసం మాత్రం ప్రయత్నం చేస్తున్నామన్నారు.
మాజీ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తో ప్రొఫెసోర్ కోదండరాం, కొండా విశ్వేశ్వర్ రెడ్డి భేటీ అయ్యారు. సమావేశం తరువాత కొండా మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కెసిఆర్ రాజకీయాలు పక్కన పెట్టి ప్రజల ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలన్నారు. కరోనా నివారణకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని... కోవిద్ తో కొట్లాడడం అందరి ముందు చేయాల్సిన పని అన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి.