వీధికుక్క మెడలో మైనంపల్లి పోటోవేసి... బిఆర్ఎస్ శ్రేణుల వినూత్న నిరసన..

కరీంనగర్ : తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుపై బిఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి.

| Updated : Aug 23 2023, 04:25 PM
Share this Video

కరీంనగర్ : తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుపై బిఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మైనంపల్లి దిష్టిబొమ్మల శవయాత్రలు, దహనం చేస్తున్నారు బిఆర్ఎస్ కార్యకర్తలు. ఇలా హుజురాబాద్ జమ్మికుంటలో వీధి కుక్క మెడలో హన్మంతరావు ఫోటో వేసి తిప్పారు. ఇలా కుక్కను వీధులన్నీ తిప్పిన తర్వాత మెడలోని హన్మంతరావు ఫోటో తీసి దహనం చేసారు. ఇలా బిఆర్ఎస్ నాయకుడు దిలీప్ ఆధ్వర్యంలో హరీష్ రావుకు మద్దతుగా, మైనంపల్లికి వ్యతిరేకంగా వినూత్న నిరసన తెలిపారు. 

ఈ సందర్భంగా దిలీప్ మాట్లాడుతూ... మంత్రి హరీష్ రావుపై నోటికొచ్చినట్లు మాట్లాడిన మైనంపల్లి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు. లేదంటే పార్టీలోంచి ఆయనను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసారు. 
 

Read More

Related Video