బాత్రూంలోనే... కట్టుకున్న భార్యను నరికిచంపిన భర్త

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని చర్లపల్లె గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.

 

First Published Feb 22, 2021, 1:06 PM IST | Last Updated Feb 22, 2021, 1:06 PM IST

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని చర్లపల్లె గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన ఓ కసాయి భర్త కట్టుకున్న భార్యను గొడ్డలితో నరికి చంపాడు. ఇలా కట్టుకున్న వాడే కాలయముడై ప్రాణాలను బలితీసుకున్నాడు. చర్లపల్లె గ్రామానికి చెందిన అసినేని శంకరయ్య-సుజాత గత 16 సంవత్సరాల క్రితం పెళ్ళి కాగా వీరికి అభిరామ్(13), నవీన్(11) ఇద్దరుపిల్లలు.  కాగా శంకరయ్య బ్రతుకుదెరువు కోసం బొంబాయి వెళ్లగా సుజాత 40 రోజుకూలికి వెళ్ళేది. కొన్ని ఏళ్ళపాటు సాపిగాసాగిన జీవితంలో శంకరయ్య మద్యానికి బానిసై బొంబాయి నుండి గ్రామానికి తిరిగివచ్చాడు. ఈ క్రమంలోనే భార్యాభర్తల మద్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి.  దీంతో ఇవాళ(సోమవారం) తెల్లవారుజామున భార్య సుజాత బాత్ రూమ్ కి వెళ్లడం చూసిన భర్త శంకరయ్య ఇంట్లో ఉన్న గొడ్డలితో నరికి హత్య చేశాడు.