పొంగులేటి దగ్గరకు ఈటెల నాకు చెప్పకుండా వెళ్లారు : బండి సంజయ్
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో గురువారం బీజేపీ నేతలు భేటీ కానున్నారు.
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో గురువారం బీజేపీ నేతలు భేటీ కానున్నారు. దీంతో ఆయన బీజేపీలో చేరనున్నారనే ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలోనే బీజేపీలో పొంగులేటి చేరిక ప్రచారంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని తెలిపారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో ఈటల బృందం భేటీపై తనకు సమాచారం లేదని చెప్పారు. ఆ విషయం తనకు చెప్పకపోవడం తప్పేమీ కాదని అన్నారు. పార్టీలో ఎవరి పనులు వారు చేసుకుంటూ వెళ్తారని చెప్పారు. తనకు తెలిసినవారితో తాను.. ఈటల రాజేందర్‌కు తెలిసన వారితో ఆయన మాట్లాడుతున్నామని బండి సంజయ్ తెలిపారు. పొంగులేటి అంశం తనకు చెప్పకపోవడంలో తప్పు ఏం లేదన్నారు. తనకు ఫోన్ లేదు కనకు సమాచారం లేదని కామెంట్ చేశారు.