Asianet News TeluguAsianet News Telugu

బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకోవడం... కేసీఆర్ పిరికిపంద చర్యే : డికె అరుణ

హైదరాబాద్ : తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రను టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తోందని...

First Published Nov 28, 2022, 12:04 PM IST | Last Updated Nov 28, 2022, 12:04 PM IST

హైదరాబాద్ : తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రను టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తోందని... ఇది సీఎం కేసీఆర్ పిరికిపంద చర్యకు నిదర్శనమని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ అన్నారు. తెలంగాణలో బిజెపి బలపడుతోంది కాబట్టే ఎలాగయినా సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ పాదయాత్రను అడ్డుకోవాలని టీఆర్ఎస్ చూస్తోందన్నారు. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లా భైంసా నుండి ఐదోవిడత పాదయాత్రకు సిద్దమైన సంజయ్ ను లా ఆండ్ ఆర్డర్ సమస్య అంటూ ఆపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఓటమి భయంతోనే టీఆర్ఎస్ పార్టీ సంజయ్ పాదయాత్రను అడ్డుకోవాలని పోలీసులను ప్రయోగిస్తోంది... ముఖ్యమంత్రివి సిగ్గుమాలిన చర్యలంటూ మండిపడ్డారు. తెలంగాణలో లా ఆండ్ ఆర్ఢర్ బావుందని... పోలీసుల పనితీరు గురించి గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం పాదయాత్ర చేస్తామంటే ఇంతలా ఎందుకు భయపడుతోందో అర్థం కావడంలేదని... ప్రభుత్వ వైఫల్యాలకు ఇదే నిదర్శనమన్నారు.  సూర్యుడికి చేయి అడ్డుపెట్టి వెలుతురు ఆపలేరు... అలాగే బండి సంజయ్ పాదయాత్రను కూడా పోలీసులను అడ్డుపెట్టుకుని ఆపలేరని డికె అరుణ పేర్కొన్నారు.