Asianet News TeluguAsianet News Telugu

రంగంలోకి సునీల్ భన్సల్... తెలంగాణలో మరింత దూకుడుగా బిజెపి

హైదరాబాద్ ; తెలంగాణలో బిజెపి ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా ఆ పార్టీ రాష్ట్ర, కేంద్ర నాయకత్వం సమిష్టిగా పనిచేస్తున్నాయి.

First Published Oct 2, 2022, 1:53 PM IST | Last Updated Oct 2, 2022, 1:53 PM IST

హైదరాబాద్ ; తెలంగాణలో బిజెపి ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా ఆ పార్టీ రాష్ట్ర, కేంద్ర నాయకత్వం సమిష్టిగా పనిచేస్తున్నాయి. అదిష్టానం ఎప్పటికప్పుడు రాష్ట్ర నాయకులకు తగు మార్గనిర్దేశం చేస్తూ ఎలా ముందుకు వెళ్లాలో సూచిస్తోంది. ఇందులో భాగంగానే బిజెపి తెలంగాణ ఇంచార్జి సునీల్ బన్సల్ రాష్ట్రానికి చెందిన జాతీయ కార్యవర్గ సభ్యులతో సమావేశమయ్యారు. నాంపల్లిలోని బిజెపి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఈటల రాజేందర్, లక్ష్మణ్, వివేక్, జితేదర్ రెడ్డి, గరికపాటి రామ్మోహన్ రావు, ఇంద్రసేనారెడ్డి , విజయశాంతి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ ప్రత్యక్షంగా కాకపోయిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.