కేసీఆర్ మళ్లీ గెలిస్తే చంద్ర మండలం కూడా ఖతమే..

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

| Updated : Aug 25 2023, 01:39 PM
Share this Video

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ మరోసారి గెలిస్తే చంద్రమండలం కూడా ఖతమే అని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రుడి మీద కూడా కేసీఆర్ భూములిస్తామని చెబుతాడని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రకటించిన మొదటి విడత జాబితాలోని సగం మంది సిట్టింగ్‌లకు బీఫామ్‌లు రావని అన్నారు. కేసీఆర్ ప్రకటించిన సీట్లన్నీ ఉత్తుత్తివే అని విమర్శించారు. ఒకరికి టికెట్ ప్రకటించి.. మరొకరిని ఇంటికి పిలుస్తున్నారని తెలిపారు. కవితకు సీటు ఇస్తే రాష్ట్రంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు అయినట్లే అని చెప్పారు. నటనలో కేసీఆర్‌ను మించినోడు దేశంలోనే లేదని అన్నారు.

Read More

Related Video