పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...డ్రైవర్ సజీవ దహనం

పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి రాజీవ్ రహదారిపై రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. 

| Updated : Aug 26 2023, 12:48 PM
Share this Video

పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి రాజీవ్ రహదారిపై రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే సజీవ దహనం కాగా, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.సుల్తానాబాద్ మారుతి రైస్ మిల్ నుంచి వస్తున్న బియ్యం లారీని రాజీవ్ రహదారిపై వెనుక నుండి టైల్స్ లారీ ఢీ కొట్టడంతో ల పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. హర్యానాకు చెందిన లారీ డ్రైవర్ ఫరియాజ్ (22)మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యాడు. లారీలో ఉన్న క్లీనర్ ఇంజుమాం బయటకు దూకడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సంఘటన స్థలానికి సుల్తానాబాద్ సిఐ జగదీష్ చేరుకొని అగ్నిమాపక సిబ్బందితో కలిసి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

Related Video