Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ ప్లాన్: ప్రశాంత్ కిశోర్ రాజకీయ క్రీడామర్మం

హైదరాబాద్: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ గత కొద్ది కాలంగా రాజకీయ క్రీడ సాగిస్తున్నారు. 

హైదరాబాద్: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ గత కొద్ది కాలంగా రాజకీయ క్రీడ సాగిస్తున్నారు. రాజకీయ పార్టీ పెడుతానంటూ ఆయన సంకేతాలు ఇచ్చి, ఆ తర్వాత కాదన్నారు. బీహార్ లో తాను పాదయాత్ర చేస్తానని, ప్రజల అభిప్రాయం తీసుకున్న తర్వాత రాజకీయ పార్టీ పెట్టే విషయంపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. కాంగ్రెసులో చేరకూడదని నిర్ణయించుకున్న తర్వాత ఆయన తాజాగా రాజకీయ పార్టీ ఆలోచన చేస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో ప్రశాంత్ కిశోర్ తో కలిసి తాను కీలకమైన పాత్ర పోషిస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇదివరకే చెప్పారు. వారిద్దరి వ్యూహంలో భాగంగానే ప్రస్తుత పరిణామాలు చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది.

Video Top Stories