సైదాబాద్ చిన్నారి రేప్, హత్య: రాజు ఆత్మహత్య వెనక కోణాలు

హైదరాబాదులోని సైదాబాదు సింగరేణి కాలనీలో చిన్నారి పాపపై అత్యాచారం చేసి, ఆమెను హత్య చేసిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. 

Naresh Kumar  | Updated: Sep 17, 2021, 11:29 AM IST

హైదరాబాదులోని సైదాబాదు సింగరేణి కాలనీలో చిన్నారి పాపపై అత్యాచారం చేసి, ఆమెను హత్య చేసిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ అమానుషమైన సంఘటనకు పాల్పడిన అనుమానితుడు రాజుపై ప్రతీకారేచ్ఛతో బాలిక కుటుంబం మాత్రమే కాకుండా సమాజం సైతం రగిలిపోయింది. ఇటువంటి ఘటనల్లో విచక్షణ నశించి, ఆగ్రహం కట్టలు తెంచుకుని వ్యక్తం కావడం అసజమేమీ కాదు, అది సహజం కూడా. కానీ అనుమాతుడు రాజు ఆత్మహత్య విసురుతున్న సవాళ్లు ఏమిటనేది చూడాల్సిన అవసరం ఉందా, లేదా అనేది అసలైన ప్రశ్న