Asianet News TeluguAsianet News Telugu

H1B తో సహా పలు వీసాలు రద్దు ....ట్రంప్

ఈ ఏడాది 31 డిసెంబర్ వరకు H1B వీసాలు మరియు వివిధ రకాల ఉద్యోగ వీసాలను ఇవ్వకూడదని అమెరికా ప్రభుత్వం ఉత్తరువులను ఇచ్చింది. 

ఈ ఏడాది 31 డిసెంబర్ వరకు H1B వీసాలు మరియు వివిధ రకాల ఉద్యోగ వీసాలను ఇవ్వకూడదని అమెరికా ప్రభుత్వం ఉత్తరువులను ఇచ్చింది .కొత్త గ్రీన్ కార్డ్స్ ఇచ్చే విధానాన్ని కూడా నిషేదించింది .ట్రంప్ నిర్ణయం తో ప్రధానం గ ఇండియా  IT  ఉద్యోగులపై ,అలాగే అమెరికాలో ఉద్యోగం కోసం ప్రయత్నించే విదేశీయుల అందరిపై  దీని ప్రభావం ఉంటుంది .అలాగే అమెరికాకు  H1B  వీసాపై వచ్చి  టైం దాటి  రెన్యూవల్ చేసుకునేవారికి  కూడా కష్టమే .ఎన్ని విమర్శలు వస్తున్నా గత ఎన్నికలలో స్థానికత అంశం మీద గెలిచిన ట్రంప్ ,త్వరలో జరగబోయే  అధ్యక్షా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో  ఈ నిర్ణయం తీసుకోని మరోసారి స్థానికులను ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు .ట్రంప్ మాత్రం  కరోనా ప్రభావంతో అమెరికా వాసులు లక్షల్లో ఉద్యోగాలు కోల్పోయారు కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాను అని అంటున్నాడు .ఈ నిర్ణయంతో స్థానికులకు 5 , 25 ,000  వేలమందికి ఉద్యోగాలు దొరికే అవకాశం వుంది అని అక్కడి అధికారులు చెపుతున్నారు .ఇప్పుడు మనం ఎలాంటి వీసాలు వున్నవారికి ఎలాంటి ప్రభావం వుంటుందో చూద్దాం .