కరోనా వాక్సిన్ సిద్ధమన్న రష్యా, నమ్మలేమంటున్న ప్రపంచదేశాలు
కరోనా వైరస్ సంక్షోభం తొలిగించడానికి టీకాలు తయారుచేసే ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది.
కరోనా వైరస్ సంక్షోభం తొలిగించడానికి టీకాలు తయారుచేసే ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది. రష్యా మాత్రం ఒక అడుగు ముందుకు వేసి వాక్సిన్ కనుకొన్నటు ప్రకటించేసింది .పూర్తీ స్థాయి టీకా ను కనుగొన్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించగానే బాధిత దేశాల ప్రజలలో ఒక నమ్మకం ఏర్పడింది . కరోనా వైరస్ అంతం చేయడానికి తాయారు చేసిన మొదటి టీకాను ప్రజలకు ఇవ్వడానికి రష్యా సిద్దమైంది. కరోనా వ్యాక్సిన్ తయారీలో తాము ప్రపంచం కంటే ముందున్నట్లు రష్యా పేర్కొంది. దీనికి స్పుత్నిక్ -విబా నామకరణం చేసారు. గమలేయ పరిశోధనా సంస్థ, రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ టీకాను అభివృద్ధి చేసింది .