సముద్రసేతు : శ్రీలంకకు చేరిన ఐఎన్ఎస్ జలాశ్వా..
వందే భారత్ మిషన్ లో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే ఆపరేషన్ సముద్రసేతు ప్రక్రియ వేగంగా సాగుతోంది.
వందే భారత్ మిషన్ లో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే ఆపరేషన్ సముద్రసేతు ప్రక్రియ వేగంగా సాగుతోంది. దీంట్లో భాగంగా శ్రీలంకలో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకురావడానికి ఐఎన్ఎస్ జలాశ్వా సిద్ధమయ్యింది. ఈ సాయంత్రం 700మంది భారతీయలుతో కొలంబో నుంచి తమిళనాడులోని ట్యూటికోరిన్ కు బయలుదేరనున్నట్టు అధికారులు వెల్లడించారు. అక్కడ నుంచి వచ్చే ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాతే నౌకలోని ఎక్కించేందుకు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఇప్పటికే మాల్దీవుల నుండి రెండు దఫాల్లో దాదాపు 1500మందిని ఐఎన్ఎస్ జలాశ్వా ద్వారా స్వదేశానికి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.