చిరంజీవి 153 వ చిత్రం ఆఫీషియల్ రీమేక్ కాదా? అదే ఫ్రెంచ్ చిత్రం నుంచి మరో కాపీనా?

లూసిఫెర్ చిరంజీవి చెయ్యబోయే నెక్స్ట్ చిత్రం.

First Published Jan 21, 2021, 4:50 PM IST | Last Updated Jan 21, 2021, 4:50 PM IST

లూసిఫెర్  చిరంజీవి చెయ్యబోయే నెక్స్ట్ చిత్రం. మలయాళం లో మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రాన్ని  తెలుగు లో అదే పేరుతో డబ్ చేసి రిలీజ్ చేసినా ఇక్కడ  ప్రేక్షకులకు నచ్చలేదు. కానీ టాలీవుడ్ లో చాలా మంది కి ఈ సినిమా నచ్చింది..చాల మంది హీరోలు ఈ సినిమా చేస్తారని, చేసేస్తున్నారని గాసిప్స్  వినిపించాయి. ఒక టైం లో అయితే పవన్ కళ్యాణ్ పేరు కూడా వినిపించింది..కానీ మెగాస్టార్ ఈ చిత్రం చెయ్యాలని ఫిక్స్ అయ్యి సుజీత్ కి తెలుగు నేటివిటీ కి తగ్గట్టు గా మార్పులు చేర్పులు చెయ్యమని అప్పచెప్పారు అని టాక్ వినిపించింది. సుజీత్ వల్లకాలేదు, తర్వాత మెహెర్ రమేష్ పేరు వినిపించింది..కాదు కాదు వినాయక్ డైరెక్టర్ అన్నారు..కానీ వినాయక్ చేసిన మార్పులు మెగాస్టార్ ని కన్విన్స్ చెయ్యలేదు అని... వినాయక్ స్టైల్ అవుట్ డేటెడ్ కామెడీ ట్రాక్స్  చిరు కి నచ్చలేదు అని చిరంజీవి కి నచ్చేలా చేంజెస్ చేయలేక మెగా కాంపౌండ్ ఆస్థాన డైరెక్టర్ వినాయక్ కూడా  నా వల్లకాదు  హేండిల్ చెయ్యలేను అని చేతులెత్తిసినట్టు  ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి..ఇక ఈ ప్రాజెక్ట్ కి ఉంటుందా లేదా అన్న టైం లో మోహన్ రాజా తో ఈ సినిమా అనౌన్స్ చేసారు.