Asianet News TeluguAsianet News Telugu

ఉగ్రం మూవీ పబ్లిక్ టాక్ : అల్లరి నరేష్ వన్ మాన్ షో... కానీ యావరేజ్ సినిమా..!

అల్లరి నరేష్‌ అంటేకామెడీకి కేరాఫ్‌. కామెడీ చిత్రాలతో హీరోగా ఎదిగి నవ్వులు పూయించిన ఆయనకి ఇప్పుడు ఆ కామెడీనే వర్కౌట్‌ కావడం లేదు. 

అల్లరి నరేష్‌ అంటేకామెడీకి కేరాఫ్‌. కామెడీ చిత్రాలతో హీరోగా ఎదిగి నవ్వులు పూయించిన ఆయనకి ఇప్పుడు ఆ కామెడీనే వర్కౌట్‌ కావడం లేదు. అందుకే ఆయన తనని తాను మార్చుకోవాల్సి వచ్చింది. సీరియస్‌ లుక్‌లోకి టర్న్ తీసుకుని చేసిన `నాంది` భారీ విజయాన్ని సాధించింది. అల్లరి నరేష్‌ని కొత్తగా ఆవిష్కరించింది. విజయ్‌ కనకమేడల ఆయనకు మంచి విజయాన్ని అందించారు. అల్లరి నరేష్‌కి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత చేసిన `మారెడుమిల్లి నియోజకవర్గం` పెద్దగా ఆడలేదు. దీంతో మరోసారి `నాంది` డైరెక్టర్‌ విజయ్‌ కనకమేడలతో కలిసి ఇప్పుడు `ఉగ్రం` చేశాడు. ఇది నేడు(మే5న)శుక్రవారం విడుదలయింది. ప్రేక్షకుల అంచనాలను ఈ సినిమా అందుకుందా లేదా అనేది ఈ పబ్లిక్ టాక్ లో చూసేయండి..!