ఆర్జీవీపై ప‌వన్‌ఫ్యాన్స్ వెబ్ సిరీస్ ‘డేరా బాబా’.. భలే షాకిచ్చారు..

వివాదాలంటే రామ్ గోపాల్ వర్మకు భలే ఇష్టం.. 

First Published Jul 21, 2020, 11:48 AM IST | Last Updated Jul 21, 2020, 11:48 AM IST

వివాదాలంటే రామ్ గోపాల్ వర్మకు భలే ఇష్టం.. పోయిపోయి వాటితోనే తల గోక్కుంటాడు.. తాజాగా ‘ప‌వ‌ర్‌స్టార్‌’ అనే సినిమాను తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. పేరుతోనే విషయం అర్థమవుతుంది కదా.. మరి పవన్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? వ‌ర్మ‌ను టార్గెట్ చేసిన ప‌వ‌న్‌ఫ్యాన్స్ ఏకంగా ‘డేరాబాబా’ అనే వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. దీనికి వీరు.కె.రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో ఆర్జీవీ పాత్ర‌లో ష‌క‌ల‌క శంక‌ర్ న‌టించాడు. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను పవన్ ఫ్యాన్స్  కూడా విడుదల చేశారు. ఇప్పటికే నూత‌న్ నాయుడు ద‌ర్శ‌క‌త్వంలో ‘ప‌రాన్న‌జీవి’ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ నెల 25న ఈ సినిమా విడుద‌ల కానుంది.