సమంత టు నయనతార: ఈ హాట్ బ్యూటీస్ ఆరోగ్య సమస్యలు తెలుసా..?
గ్లామర్ రంగంలో అందం ఎంతో కీలకం. మరి అందంగా కనిపించాలంటే ఆరోగ్యం ఎంతో అవసరం.
గ్లామర్ రంగంలో అందం ఎంతో కీలకం. మరి అందంగా కనిపించాలంటే ఆరోగ్యం ఎంతో అవసరం. క్షణం తీరిక లేకుండా గడిపే హీరోయిన్స్ కి సమయానికి తినడం, నిద్రపోవడం కుదరకపోవచ్చు. దేశ దేశాలకు ప్రయాణాలు, అనేక రకాల ఆహారపు అలవాట్లు వాళ్ళ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇన్ని ప్రతికూలతలు ఉన్నా.. ఎంతో జాగ్రత్తగా హీరోయిన్స్ తమ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. ఐతే కొందరు స్టార్ హీరోయిన్స్ మాత్రం తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. అలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్న హీరోయిన్స్ ఎవరో చూద్దాం..