డేటింగ్ చేయమని సమంత కి ఫ్యాన్ రిక్వెస్ట్... సామ్ సమాధానం తెలుసా..?

సమంత గత రెండేళ్లుగా అత్యంత సంఘర్షణతో కూడిన సమయాన్ని గడిపింది. 

First Published Mar 27, 2023, 3:13 PM IST | Last Updated Mar 27, 2023, 3:13 PM IST

సమంత గత రెండేళ్లుగా అత్యంత సంఘర్షణతో కూడిన సమయాన్ని గడిపింది. ఇంట్లో వివాహ జీవితంలో ఏర్పడిన విభేదాలతో ఆమె ఎంతో బాధపడింది. చివరికి భర్త నాగచైతన్యతో విడిపోయింది. ఈ విడిపోయే క్రమంలో ఆమె ఫేస్‌ చేసిన మానసిక సంఘర్షణ అంతా ఇంతా కాదు. డిప్రెషన్‌ స్థాయికి వెళ్లి కోలుకుంది. దైర్యంగా నిలబడింది. కొత్త జీవితాన్ని ప్రారంభించింది. వరుసగా సినిమా అవకాశాలను దక్కించుకుని పనిలో బిజీ అయ్యింది. ఆ చేదు జ్ఞాపకాలను మర్చిపోయేందుకు శతవిధాలా ప్రయత్నించి ఆల్మోస్ట్ విజయం సాధించిందనే చెప్పాలి.