Asianet News TeluguAsianet News Telugu

జగ్గయ్యపేటలో ఘనంగా... వైసిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను తనయుడు, యువనాయకులు సామినేని వెంకట కృష్ణప్రసాద్ ఈ ఆవిర్భావ వేడుకల్లో  పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే నివాసం నుండి జగ్గయ్యపేట పట్టణ ప్రధాన రహదారులపై వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో దివంగత వైఎస్సార్ విగ్రహానికి వెంకట కృష్ణప్రసాద్  పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి, మిఠాయిలు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ పార్టీ కార్యదర్శి  ప్రభాకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరావు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 

Video Top Stories