నియోజకవర్గ అభివృద్ధికి సలహాలు-సూచనలు: వైసిపి ఎమ్మెల్యే వినూత్న కార్యక్రమం
విజయవాడ: కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్థానిక ప్రజలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటుచేశారు.
విజయవాడ: కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్థానిక ప్రజలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటుచేశారు. ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు ఈ సమావేశానికి పలువురు వ్యాపారవేత్తలు, ప్రజాసేవ చేసే వివిధ సంఘాల ప్రతినిధులు, లయన్స్ క్లబ్ నాయకులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్, పుర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ....మైలవరం అభివృద్ధికి తాను ఏం చేయాలో సలహాలు ఇవ్వాలని కోరారు. అలాగే మైలవరంలో వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించాలని.... గెలిపిస్తే మరింత అభివృద్ధి సాధించడానికి దోహదపడుతుంది వసంత కృష్ణప్రసాద్ అన్నారు.