ఏయూలో 300అడుగుల భారీ జెండా ప్రదర్శన... సందడిచేసిన మిస్ సౌత్ ఇండియా

విశాఖపట్నం : 75వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను కేంద్ర ప్రభుత్వం అజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట ఘనంగా నిర్వహిస్తూ దేశప్రజల్లో దేశభక్తిని పెంపొందించే ప్రయత్నం చేస్తోంది.

First Published Aug 5, 2022, 8:10 PM IST | Last Updated Aug 5, 2022, 8:10 PM IST

విశాఖపట్నం : 75వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను కేంద్ర ప్రభుత్వం అజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట ఘనంగా నిర్వహిస్తూ దేశప్రజల్లో దేశభక్తిని పెంపొందించే ప్రయత్నం చేస్తోంది. కేంద్ర పిలుపును అందుకున్న యావత్ దేశం దేశభక్తి కార్యక్రమాలను చేపడుతోంది. ఇలా ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్టణంలో ప్రముఖ ఆంధ్రా యూనివర్సిటీలో 300 అడుగుల మువన్నెల జెండా ప్రదర్శిస్తూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. యువతలో దేశభక్తిని పెంపొందించేందుకు ఈ భారీ జాతీయ జెండా ప్రదర్శన చేపట్టినట్లు విసి ప్రసాద రావు తెలిపారు. ఈ జెండా ప్రదర్శన కార్యక్రమంలో మిస్ సౌత్క ఇండియా చరిష్మా కృష్ణ పాల్గొన్నారు.