ఎన్నో అవమానాలు పడ్డా.. అందుకే జగన్ కి దూరమయ్యా: Vijayasai Reddy Shocking Comments | Asianet Telugu
వైఎస్ జగన్ నమ్మిన బంటు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి కాకినాడ పోర్టు అక్రమాల కేసులో సీఐడీ విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కోటరీ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో స్పందించారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ వల్లే తాను వైసీపీకి, పార్టీ అధినేతకు దూరమయ్యానని చెప్పారు. అలాగే, వైసీపీ నుంచి బయటకు రావడానికి గల కారణాలను కూడా వివరించారు.