ఏపీకి భారీగా తెలంగాణ మద్యం... అక్రమంగా తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్

విజయవాడ: అక్రమ మార్గాల్లో రాష్ట్రానికి చేరుతున్న ఇతర రాష్ట్రాల మద్యాన్ని అడ్డుకోడానికి తెలంగాణ సర్కార్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించడంలేదు. 

First Published Dec 13, 2020, 2:32 PM IST | Last Updated Dec 13, 2020, 2:32 PM IST

విజయవాడ: అక్రమ మార్గాల్లో రాష్ట్రానికి చేరుతున్న ఇతర రాష్ట్రాల మద్యాన్ని అడ్డుకోడానికి తెలంగాణ సర్కార్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించడంలేదు. మరీముఖ్యంగా ప్రతిరోజూ తెలంగాణ సరిహద్దు నుండి మద్యం ఆంధ్ర ప్రదేశ్ కు చేరుతోంది. ఇలా ఆదివారం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం అగ్రహారం గ్రామ సమీపంలోని కాకతీయ సిమెంట్ ఫ్యాక్టరీ రోడ్ మీదుగా రెండు బైక్ లపై తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. చిల్లకల్లు ఎస్సై వెంకటేశ్వరరావు, టాస్క్ ఫోర్స్ ఎస్సై మురళీకృష్ణతో పాటు వారి సిబ్బంది అక్రమ  మద్యాన్ని పట్టుకున్నారు. అక్రమంగా మద్యాన్ని తీసుకువస్తున్న జయంతిపురం గ్రామానికి చెందిన వారిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 450 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.