Asianet News TeluguAsianet News Telugu

జగన్ రెడ్డి... ఎన్టీఆర్, ఎంజిఆర్ తో కాదు బందిపోట్లతో పోల్చుకో..: సోమిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

అమరావతి : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన విమర్శలకు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటరిచ్చారు.

అమరావతి : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన విమర్శలకు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటరిచ్చారు. తెలుగుదేశం పార్టీని కాపాడుకునేందుకు తామంతా ప్రజాస్వామ్యబద్దంగా చంద్రబాబును అధ్యక్షుడిగా ఎన్నుకున్నామని... ఎన్టీఆర్ పక్కనేవుంటూ ఆయనకు వెననుపోటు పొడిచింది లక్ష్మీపార్వతి అని అన్నారు. అలాంటిది ఆమెకు మీరు పదవులిచ్చి పక్కనపెట్టుకున్నారని అన్నారు.  విజన్, అభివృద్ది అంటే గుర్తొచ్చేది చంద్రబాబు... మరి విధ్వంసం, అరాచకం, చిన్నాన్న గొడ్డలిపోటు, పీకే సలహాలతో దొంగ పోట్లు, కోడి కత్తి, సిబిఐ చార్జీ షీట్, 43వేల కోట్ల అవినీతి, చంచల్ గూడ జైలు అంటే గుర్తొచ్చేది జగన్ అంటూ సోమిరెడ్డి మండిపడ్డారు. మీ అనుభవమెంత, మీరెంత... చంద్రబాబును అనే అర్హత మీకు లేదంటూ జగన్ ను సోమిరెడ్డి హెచ్చరించారు. జగన్ మహనీయులు ఎన్టీఆర్, ఎంజిఆర్ తో పోల్చుకోవడం కాదు బందిపోట్లతో పోల్చుకోవాలని అన్నారు. రాష్ట్రం దుర్మార్గుల చేతుల్లోకి వెళ్లిపోయిందని ప్రజలు బాధపడుతున్నారు... ఇక వైసిపి పని అయిపోయిందన్నారు. ఇక ప్రజలు మీకు బుద్దిచెప్పు రోజులు దగ్గర్లోనే వున్నాయంటూ సోమిరెడ్డి హెచ్చరించారు.