Asianet News TeluguAsianet News Telugu

ఆరేళ్ల బాలుడిపై లైంగిక దాడి.... చిన్నారిని పరామర్శించిన మాజీ మంత్రి ఉమ

విజయవాడ : కృష్ణా జిల్లా కొండపల్లిలో అభం శుభం తెలియని ఆరేళ్ల బాలుడిపై అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. ఇంటి బయట ఆడుకుంటున్న బాలున్ని ఎత్తుకెళ్లి పక్కనే నిర్మానుష్యంగా వుండే ప్రాంతంలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అసహజ లైంగిక దాడితో తీవ్ర అస్వస్థతకు గురయిన బాలుడు గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నాడు. తాజాగా బాధిత బాలుడికి, కుటుంబాన్ని పరామర్శించారు మాజీ మంత్రి, టిడిపి నాయకులు దేవినేని ఉమ. బాలుడి పరిస్థితిపై వైద్యులను, కుటుంబసభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు ఉమ. ఆదివారం మధ్యాహ్నం ఘటన జరిగితే ఇప్పటికీ కేసు ఎందుకు నమోదు చేయలేదని పోలీసులను ప్రశ్నించారు. ఈ ఘటనను ఎందుకు దాచిపెట్టాలని చూస్తున్నారని పోలీసులను నిలదీశారు. బాలుడిపై లైంగికదాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి దేవినేని ఉమ డిమాండ్ చేశారు. 
 

First Published Aug 24, 2021, 10:08 AM IST | Last Updated Aug 24, 2021, 10:08 AM IST

విజయవాడ : కృష్ణా జిల్లా కొండపల్లిలో అభం శుభం తెలియని ఆరేళ్ల బాలుడిపై అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. ఇంటి బయట ఆడుకుంటున్న బాలున్ని ఎత్తుకెళ్లి పక్కనే నిర్మానుష్యంగా వుండే ప్రాంతంలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అసహజ లైంగిక దాడితో తీవ్ర అస్వస్థతకు గురయిన బాలుడు గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నాడు. తాజాగా బాధిత బాలుడికి, కుటుంబాన్ని పరామర్శించారు మాజీ మంత్రి, టిడిపి నాయకులు దేవినేని ఉమ. బాలుడి పరిస్థితిపై వైద్యులను, కుటుంబసభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు ఉమ. ఆదివారం మధ్యాహ్నం ఘటన జరిగితే ఇప్పటికీ కేసు ఎందుకు నమోదు చేయలేదని పోలీసులను ప్రశ్నించారు. ఈఘటనను ఎందుకు దాచిపెట్టాలని చూస్తున్నారని పోలీసులను నిలదీశారు. బాలుడిపై లైంగికదాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి దేవినేని ఉమ డిమాండ్ చేశారు.