విజయనగరం జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు... ఏకంగా ఆర్టిసి బస్సే చోరీ

విజయనగరం :  బంగారం, వెండి ఆభరణాలను దొంగిలించడం చూసుంటారు...

| Updated : Aug 09 2022, 05:07 PM
Share this Video

విజయనగరం :  బంగారం, వెండి ఆభరణాలను దొంగిలించడం చూసుంటారు... బైక్, కారు వంటి వాహనాలను దొంగిలించడమూ చూసుంటారు... కానీ ఏకంగా ఆర్టిసి బస్సును దొంగిలించినట్లు ఎప్పుడయినా విన్నారా?... అయితే విజయంనగరం జిల్లాలో జరిగిన ఘరానా దొంగతనం గురించి తెలుసుకోవాల్సిందే.    పాలకొండ ఆర్టిసి డిపోకు చెందిన ఆర్టిసి బస్సు రాత్రి వంగరకు వుండి తెల్లవారుజామునే ప్రారంభమవుతుంది. ఇలా ఎప్పటిలాగే సోమవారం రాత్రి నిలిపివుంచిన ఆర్టిసి బస్సును గుర్తుతెలియని దుండగులు దొంగిలించారు. తాను నిలిపివుంచిన చోట బస్సు కనిపించకపోవడంతో ఆందోళనచెందిన డ్రైవర్ బుజ్జి ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. వారు వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగి కేవలం గంటల వ్యవధిలోనే బస్సు ఆచూకీ కనిపెట్టారు.  రేగిడి మండలం మీసాల డోలపేట వద్ద బస్సు స్వల్పంగా ధ్వంసమైన స్థితిలో కనిపించింది. బస్సు దొంగతనానికి పాల్పడిన నిందితులను గుర్తించేందుకు పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. 

Read More

Related Video