తిరుపతిలో... సర్వాంగసుందరంగా ముస్తాబైన రామతీర్థం రామయ్య

విజయనగరం: రామ తీర్థంలో ఇటీవల దుండగుల చేతిలో ధ్వంసమైన విగ్రహాల స్థానంలో ప్రతిష్టించడానికి  సీతారామ లక్ష్మణ విగ్రహాలు సిద్దమయ్యాయి.

First Published Jan 20, 2021, 1:58 PM IST | Last Updated Jan 20, 2021, 2:21 PM IST

విజయనగరం: రామ తీర్థంలో ఇటీవల దుండగుల చేతిలో ధ్వంసమైన విగ్రహాల స్థానంలో ప్రతిష్టించడానికి  సీతారామ లక్ష్మణ విగ్రహాలు సిద్దమయ్యాయి. తిరుపతిలోని టిటిడి శిల్ప‌కళాశాలలోని ఖార్కానాలో శిల్పులు గత పదిహేను రోజులుగా విగ్రహాలను తయారు చేస్తున్నారు. రామతీర్థం ఆలయ ప్రధానార్చకుడు సాయి ఇచ్చిన సలహాల మేరకు, గతంలో ఎలా ఉన్నాయో అదేవిదంగా విగ్రహాలను తయారు చేస్తున్నారు. సీనియర్ స్తపతి మారుతీ రావు అద్వర్యంలో ముగ్గురు శిల్పులు మూడు విగ్రహాలను తయారు చేసారు. ఈ విగ్రహాలకు తుది మెరుగులు దిద్దుతున్నారు. మరో రెండు రోజుల్లో రామతీర్థంకు కొత్త విగ్రహాలు చేర్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.