Asianet News TeluguAsianet News Telugu

బ్రతికుండగానే చంపేసిన సోషల్ మీడియా... ఆత్మహత్య ప్రచారంపై నూజివీడు సీఐ సీరియస్

ఏలూరు : సోషల్ మీడియా ఎఫెక్ట్ తో తాను బ్రతికే వున్నానని ఓ పోలీస్ అధికారి స్వయంగా ప్రకటించుకోవాల్సి వచ్చింది. 

ఏలూరు : సోషల్ మీడియా ఎఫెక్ట్ తో తాను బ్రతికే వున్నానని ఓ పోలీస్ అధికారి స్వయంగా ప్రకటించుకోవాల్సి వచ్చింది. ఏలూరు జిల్లా నూజివీడు రూరల్ సిఐ రాజులపాటి అంకబాబు తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడంటూ సోషల్ మీడియా ముమ్మర ప్రచారం జరిగింది. ఫేస్ బుక్ లో సీఐ ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఎవరో ఫేక్ న్యూస్ పోస్ట్ చేయగా నిజమేనని నమ్మిన చాలామంది దాన్ని ఇతరులకు షేర్ చేసారు. ఇలా ఈ ఫేక్ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ చివరకు సదరు సీఐ వద్దకు చేరింది. దీంతో వెంటనే సీఐ తాను క్షేమంగానే వున్నానని... ఆత్మహత్య చేసుకున్నట్లు జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమేనని వీడియో విడుదల చేసారు. 

తాను ఆత్మహత్య చేసుకున్నట్లు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినవారిపై కఠినచర్యలు తీసుకుంటామని సీఐ అంకబాబు హెచ్చరించారు. తప్పుడు వార్తలు ప్రచురించిన వారిపైనే కాదు దాన్ని నిర్దారించుకోకుండా సర్క్యులేట్ చేసినవారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ అంకబాబు తెలిపారు.