నీ కొడుకు సగం బట్టలతో అమ్మాయిలతో తిరితే లేనిది...: చంద్రబాబును నిలదీసిన మంత్రి నాగార్జున

అమరావతి : వైసిపి ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారంపై మంత్రి మేరుగ నాగార్జున స్పందించారు.

| Updated : Aug 10 2022, 11:27 AM
Share this Video

అమరావతి : వైసిపి ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారంపై మంత్రి మేరుగ నాగార్జున స్పందించారు. నాలుగు గోడల మధ్య జరిగిన వ్యవహారాన్ని గోరంతది కొండత చేస్తూ గోరంట్ల మాధవ్ పై చంద్రబాబు, టీడీపీ నాయకులు విషం వెళ్ళగక్కుతున్నారని అన్నారు. బీసీ, ఎస్సీ నాయకులను అణగదొక్కేందుకే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు... ఇలా కుట్రలో భాగంగానే మాధవ్ వీడియోను వివాదంపై వివాదం చేస్తున్నారన్నారు. తన వీడియోను మార్ఫింగ్ చేసారని మాధవే స్వయంగా ఫిర్యాదు చేసారు... విచారణలో అసలు నిజాలేమిటో బయటపడతాయని మంత్రి పేర్కొన్నారు. కేవలం గంటసేపట్లో మాధవ్ వీడియోపై నిజానిజాలు తేలతాయంటున్న టిడిపి నాయకులు ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయినా ఇప్పటివరకు ఎందుకు నిర్దారించలేదని మంత్రి ప్రశ్నించారు. తన తనయుడు లోకేష్ అర్ధనగ్నంగా బీచుల్లో అమ్మాయిలతో చిందులు వేయడంపై, టిడిపి నాయకుల కాల్ మనీ సెక్స్ రాకెట్ పై చంద్రబాబు ఎందుకు మాట్లాడరని అడిగారు. నిజంగానే గోరంట్ల మాధవ్ తప్పు‌ చేశాడని తెలితే చర్యలు కఠినంగా ఉంటాయని మంత్రి  నాగార్జున స్పష్టం చేసారు. 

Read More

Related Video