భోగాపురం ఎయిర్ పోర్టుకి శంకుస్థాపన చేసిన సీఎం జగన్

ప్రజల ఆశీస్సులు   ఉన్నంత వరకు  ఎవరు  ఎన్ని కుట్రలు  చేసినా  పనిచేయవని  ఏపీ సీఎం వైఎస్ జగన్  చెప్పారు. బుధవారంనాడు బోగాపురం ఎయిర్ పోర్టుకు  ఏపీ సీఎం వైఎస్ జగన్  శంకుస్థాపన  చేశారు.  

| Updated : May 03 2023, 05:55 PM
Share this Video

ప్రజల ఆశీస్సులు   ఉన్నంత వరకు  ఎవరు  ఎన్ని కుట్రలు  చేసినా  పనిచేయవని  ఏపీ సీఎం వైఎస్ జగన్  చెప్పారు. బుధవారంనాడు బోగాపురం ఎయిర్ పోర్టుకు  ఏపీ సీఎం వైఎస్ జగన్  శంకుస్థాపన  చేశారు.  ఈ సందర్భంగా  నిర్వహించిన  సభలో   సీఎం  జగన్  ప్రసంగించారు. ఎన్నికల మేనిఫెస్టోలో   98.5 శాతం అమలు చేసినట్టుగా  జగన్  చెప్పారు. ఇచ్చిన హామీలను నెరవేర్చినందునే  మీ ముందుకు  వచ్చి అడిగే అర్హత  తమకే ఉందని  జగన్  అభిప్రాయపడ్డారు.   ఏ మంచి చేయని చంద్రబాబుకు  దుష్టచతుష్టయం మద్దతు ఇస్తుందని  జగన్ విమర్శించారు.  ఏ మంచి  చేయని చంద్రబాబుకు  దత్తపుత్రుడు ఎందుకు సహకరిస్తున్నాడని  ఆయన  పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు.  

Related Video