Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో మత్స్యకార భరోసా ప్రారంభం.. ఒక్కొక్కరి అకౌంట్లో పదివేలు...

ఏపీలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ప్రారంభించారు. 

First Published May 6, 2020, 6:16 PM IST | Last Updated May 6, 2020, 6:30 PM IST

ఏపీలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ప్రారంభించారు. వివిధ జిల్లాల నుంచి కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పథకం కింద మత్స్యకారుల ఖాతాలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ. 10 వేలు జమ చేయనుంది. మొత్తం లక్షా 9 వేల 231 మంది లభ్దిదారులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ సందర్భంగా సీఎం మత్స్యకారులతో మాట్లాడారు. కరోనా, లాక్‌డౌన్ సమయంలో కష్టాలు ఉన్నాసరే.. మత్స్యకారుల కష్టాలు పెద్దవి అని మత్స్యకార సోదరులకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారి బతుకులు మారాలని ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చామన్నారు.