సీఎం క్రైస్తవుడు అనడానికి ఆధారాలున్నాయా?. .హైకోర్టు సూటి ప్రశ్న...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మతంపై ఏపీ హైకోర్టు షాకింగ్ ప్రశ్న వేసింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మతంపై ఏపీ హైకోర్టు షాకింగ్ ప్రశ్న వేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలోకి అన్యమతస్తులు వెళ్లేటప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని, కానీ అన్యమతస్థుడైన ఏపీ సీఎం వైఎస్ జగన్ అందుకు విరుద్ధంగా వ్యవహరించారని పిటిషనర్ చేసిన వాదనతో ఏపీ హైకోర్టు విభేదించింది.