విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సోనూసూద్

విజయవాడ: ఓ ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం విజయవాడకు విచ్చేసిన ప్రముఖ సీనీనటుడు సోనూసూద్ ఇంద్రకీలాద్రికి చేరుకుని కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. 

| Updated : Sep 09 2021, 03:59 PM
Share this Video

విజయవాడ: ఓ ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం విజయవాడకు విచ్చేసిన ప్రముఖ సీనీనటుడు సోనూసూద్ ఇంద్రకీలాద్రికి చేరుకుని కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన సోనూసూద్ కు అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందచేశారు. ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ... కనకదుర్గమ్మ దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. కరోనా కారణంగా ఎంతో మంది అనేక ఇబ్బందులు పడ్డారని... ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయి ప్రతిఒక్కరూ సుఖసంతోషాలతో వుండాలని కోరుకున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశం అభివృద్ధి చెందాలని... అందరినీ చల్లగా కాపాడాలని దుర్గమ్మను కొరుకున్నట్లు సోనూసూద్ తెలిపారు.  
 

Related Video