బాబోయ్.. పొలాల్లోకి వచ్చిన 20 అడుగుల గిరినాగు.. హడలిపోయిన రైతులు..
విశాఖ జిల్లా, తంగుడుబిల్లి పొలాల్లో సుమారు 20 అడుగులకు పైగా పొడవు ఉన్న గిరి నాగును స్థానిక రైతులు చూసి ఒక్కసారిగా హడలిపోయారు.
విశాఖ జిల్లా, తంగుడుబిల్లి పొలాల్లో సుమారు 20 అడుగులకు పైగా పొడవు ఉన్న గిరి నాగును స్థానిక రైతులు చూసి ఒక్కసారిగా హడలిపోయారు. బుసలు కొడుతున్న పామును చూసి భయాందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని అటవీ అధికారి రమేష్ కుమార్‌కు రైతులు ఫోన్ చేసి తెలిపారు. వెంటనే
స్పందించిన రమేస్ కుమార్ విశాఖలోని వన్యప్రాణి సంవరక్షణ సమితి అధికారి మూర్తికి గిరినాగు సమాచారం అందించారు. ఆయన ఆ ప్రాంతానికి చేరుకుని పొదల్లో దాగిన నాగును చాకచక్యంగా పట్టుకున్నారు. తర్వాత దాన్ని చెరుకుపల్లి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఇది సుమారు 20 అడుగుల
పొడవు ఉంది. సుమారు రెండు గంటల పాటు శ్రమించి అతికష్టం మీద గిరినాగును పట్టుకున్నారు.