ఎటు పోతున్నాం.. ఏం చేస్తున్నాం, మానం పాత రాతియుగంలో ఉన్నామా..? రాక్షస జన్మ ఎత్తామా, అసలు మనుషులమేనా, మృగాలమా. సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను చూస్తుంటే.. ఇదే అనుమానం కలుగుతోంది. ఈ కాలంలో కూడా కులాలు, కట్టుబాట్లు అంటూ జరుగుతున్న దారుణాలు చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది.

తాజాగా హైదరాబాద్ పాత బస్తీలో జరిగిన సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ప్రేమ వ్యవహారం ఓ యువతిని బలి తీసుకుంది. నారాయణ్‌ఖేడ్‌కు చెందిన యువతిపై అత్యాచారం చేసి దారుణంగా చంపేశారు.

హైదరాబాద్ పాతబస్తీ రెయిన్‌బజార్‌లో ఈ ఘటన జరిగింది. సొంత తమ్ముడు ప్రేమించిన యువతిపై అతని అన్నే అఘాయిత్యానికి పాల్పడి చంపేశాడు. కులాలు వేరు కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పోస్ట్‌మార్టం పూర్తయ్యింది. మృతురాలి డెడ్ బాడీని బంధువులకు అప్పగించడంతో నారాయణ్‌ఖేడ్‌కు తరలిస్తున్నారు.