'సోషల్ మీడియా పైత్యం పతాకస్థాయికి చేరింది".. సజ్జనార్ పోస్ట్ చేసిన వీడియో వైరల్..

TSRTC MD Sajjanar: సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ.. సమాజంలో జరుగుతున్న పలు అంశాలను ఆన్ లైన్ వేదికగా షేర్‌ చేస్తూ.. అవర్నెస్ కల్పించడంలో ముందు వరుసలో ఉంటారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌. ఎప్పటికప్పుడు సైబర్ క్రైమ్‌లు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తుంటారు. తాజాగా ఆయన ఓ వీడియోను షేర్‌ చేశారు. 

Telangana RTC MD Sajjanar Shares A Video Goes Viral In Social Media KRJ

TSRTC MD Sajjanar: ఈ రోజుల్లో సోషల్ మీడియా రీల్స్ పిచ్చి ఎంతలా పెరిగిపోతోందో చెప్పవాల్సిన అవసరం లేదు. రీల్స్ మోజులో పడి యువత ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు. కొంతమంది అయితే తమ ప్రాణాలను సైతం లెక్క చేయడం లేదు. ఇష్టానుసారంగా ప్రయత్నిస్తూ.. కొంతమంది తమ ప్రాణాలనే కాదు.. ఎదుటి వారికి ప్రాణాలకు కూడా ప్రమాదంలో పడేస్తున్నారు. సీసీటీవీ కెమెరాలు, ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి ప్రమాదాలకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ఎక్స్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. 

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. నిత్యం సమాజంలో జరుగుతున్న పలు అంశాలను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేస్తూ.. ప్రజల్లో అవగాహన కల్పించడంలో ముందు వరుసలో ఉంటారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌. ఎప్పటికప్పుడు సైబర్ క్రైమ్‌లు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తుంటారు. తాజాగా ఆయన ఓ వీడియోను షేర్‌ చేశారు. 
 
సజ్జనార్ పోస్ట్ చేసిన వీడియో..

ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా ముగ్గురు యువకులు బైక్‌పై అతివేగంగా వెళ్తూ నిర్లక్ష్యంగా నడుపుతున్న వీడియోను షేర్ చేశారు. ‘యూత్ కి సోషల్ మీడియా పైత్యం పతాకస్థాయికి చేరుతోంది. ఫేమస్ కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఇలాంటి చిత్రవిచిత్ర పిచ్చి పనులు చేస్తున్నారు. కొందరు పిల్లలు ఇలా మారడానికి పరోక్ష కారణం తల్లిదండ్రులే. వారి పర్యవేక్షణ లోపం వల్లే రోడ్లపై ఇలాంటి వెర్రి వేషాలు వేస్తున్నారు.’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios