MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నా భార్య నన్ను ప్రేమించడం లేదు, ఎట్టకేలకు బయటపడ్డ అల్లు అర్జున్... స్నేహారెడ్డి అలాంటి అమ్మాయా?

నా భార్య నన్ను ప్రేమించడం లేదు, ఎట్టకేలకు బయటపడ్డ అల్లు అర్జున్... స్నేహారెడ్డి అలాంటి అమ్మాయా?

అల్లు అర్జున్-స్నేహారెడ్డి టాలీవుడ్ బెస్ట్ కపుల్. వాళ్ళు చాలా అన్యోన్యంగా ఉంటారు. అయితే ఇదంతా పైకి మాత్రమే అట. స్నేహ నన్ను ప్రేమించడం లేదని తన ఆవేదన వెళ్లగక్కాడు అల్లు అర్జున్.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : May 09 2024, 07:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Allu Arjun

Allu Arjun

అల్లు అర్జున్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2012లో స్నేహారెడ్డితో ఏడడుగులు వేశాడు. ఓ వేడుకలో కామన్ ఫ్రెండ్ ద్వారా స్నేహారెడ్డితో అల్లు అర్జున్ కి పరిచయం అయ్యింది. అది స్నేహంగా మారి ప్రేమకు దారి తీసింది. రోజూ ఫోన్లు చేసుకుని మాట్లాడుకునేవారట. 
 

27
Allu Arjun

Allu Arjun

వివాహం చేసుకోవాలని డిసైడ్ అయిన అల్లు అర్జున్-స్నేహారెడ్డి.. విషయాన్ని కుటుంబ సభ్యులతో చెప్పారట. అల్లు అరవింద్ వెంటనే ఒప్పుకున్నారట. స్వయంగా స్నేహారెడ్డి ఇంటికి సంబంధం మాట్లాడటానికి వెళ్ళాడట. స్నేహారెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి మాత్రం తటపటాయించాడట. సినిమా వాళ్లకు పిల్లను ఇవ్వను అన్నారట.

37
Allu Arjun

Allu Arjun


అనంతరం స్నేహారెడ్డి పెళ్లంటూ చేసుకుంటూ అల్లు అర్జున్ నే చేసుకుంటానని కుండబద్దలు కొట్టిందట. చేసేది లేక చంద్రశేఖర్ రెడ్డి దిగి వచ్చాడట. అల్లు అర్జున్ తో పెళ్ళికి ఒప్పుకున్నారట. వీరికి ఇద్దరు సంతానం. అబ్బాయి పేరు అయాన్ కాగా, అమ్మాయి పేరు అర్హ. పిల్లలను పెంచి పెద్ద చేసే బాధ్యత అల్లు స్నేహారెడ్డి తీసుకుంది. 
 

47
Allu Arjun

Allu Arjun


సోషల్ మీడియాలో అల్లు అర్జున్, స్నేహారెడ్డి తమ ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు. అవి చూస్తే అల్లు అర్జున్-స్నేహారెడ్డి చాలా అన్యోన్యంగా ఉంటారని అర్థం అవుతుంది. కానీ అది నిజం కాదని అంటున్నాడు అల్లు అర్జున్. తనది వన్ సైడ్ లవ్వేనట. ఈ విషయాన్ని పబ్లిక్ లో చెప్పి షాక్ ఇచ్చాడు. 

57
Allu Arjun

Allu Arjun


అల్లు అర్జున్ నటించిన ఆర్య విడుదలై 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా స్పెషల్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. వేదికపై అల్లు అర్జున్ ని నిజ జీవితంలో వన్ సైడ్ లవ్ గురించి చెప్పాలని యాంకర్ అడిగింది. స్నేహారెడ్డితో ఇప్పటికీ నాది వన్ సైడ్ లవ్వే. మనం ప్రేమించడం తప్పితే అటు నుంచి పెద్దగా రెస్పాన్స్ ఉండదు.. అన్నాడు. 

67
Allu Arjun

Allu Arjun

ఈ కామెంట్స్ పరోక్షంగా స్నేహారెడ్డి అల్లు అర్జున్ పట్ల పెద్దగా ప్రేమ కలిగి ఉండరనే అర్థం వస్తుంది. అయితే ఈ వ్యాఖ్యలు అల్లు అర్జున్ నవ్వుతూ సరదాగా చెప్పాడు. మరి ఆయన కేవలం జోక్ చేశాడా? నిజంగా అల్లు అర్జున్ ప్రేమించినంతగా స్నేహారెడ్డి ఆయన్ని ప్రేమించడం లేదా అనేది తెలియదు. 

 

77
Allu Arjun

Allu Arjun

మరోవైపు అల్లు స్నేహారెడ్డి గ్లామరస్ ఫోటో షూట్స్ చేయడం విశేషం. ఆమె ఫిట్నెస్ ఫ్రీక్. చాలా స్లిమ్ అండ్ ఫిట్ గా ఉంటారు. అందుకోసం వ్యాయామం, యోగా చేస్తారు. ఆహార నియమాలు పాటిస్తుంది. ఇక అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. పుష్ప 2తో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
50 లక్షల బడ్జెట్, 120 కోట్ల కలెక్షన్స్, సెన్సేషనల్ మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడో తెలుసా?
Recommended image2
పెళ్లి తర్వాత రష్మిక మందన్న ఫుల్ బిజీ.. లైన్‌లో 6 సినిమాలు, విజయ్ దేవరకొండ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్..
Recommended image3
Theatre Movies: ఈ వారం విడుదల కాబోతున్న సినిమాలు.. శ్రీవిష్ణు మళ్లీ వస్తున్నాడు, వరలక్ష్మి ప్రయోగం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved