నేడు వేములవాడకు ప్రధాని మోడీ .. స్వామివారికి ప్రత్యేక పూజలు.. తొలి ప్రధానిగా రికార్డ్

PM Modi: ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేడు తెలంగాణలోని వేములవాడకు వస్తున్నారు. తెలంగాణలోని ఓ ప్రముఖ శైవక్షేత్రానికి తొలిసారి ప్రధాని రావడం విశేషంగా చెప్పుకుంటున్నారు.

PM Modi To Campaign In Vemulawada And Warangal Public Meetings today krj

PM Modi: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు తెలంగాణలో ప్రచారం చేయనున్నారు. ఈ క్రమంలోనే ఉదయం రాజన్న సిరిసిల్లలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొనున్నారు. వేములవాడ రాజన్నకు కోడేమొక్కులు చెల్లించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయం చెరువు సమీపంలో హెలిప్యాడ్ ను అధికారులు సిద్ధం చేశారు.

అలాగే 1200 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు.లోక్ సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రధాని మోడీ  మంగళవారం హైదారాబాద్‌కు చేరుకున్నారు.  రాత్రి రాజ్ భవన్‌లో బస చేశారు. ఉదయం ఎనిమిదిన్నర సమయానికి బేగంపేట విమానాశ్రయానికి బయల్దేరి అక్కడి నుంచి హెలికాప్టర్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చేరుకుంటారు.  

స్వామి వారి దర్శనం తరువాత కోర్టు పక్కన గల మైదానంలో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. అనంతరం కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థి బండి సంజయ్‌కు మద్దతుగా కరీంగనగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రచారసభలో మోదీ పాల్గొంటారు. ఆ తర్వాత వరంగల్‌ భాజపా లోక్‌సభ అభ్యర్థి ఆరూరి రమేష్‌కు మద్దతుగా నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోడీ  పాల్గొంటారు. ఇప్పటి వరకు వేములవాడ రాజన్న దేవాలయాన్ని ఏ ప్రధాని కూడా దర్శించలేదు. తొలిసారి ప్రధాని మంత్రి హోదాలో నరేంద్రమోడీ.. రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios