హైదరాబాద్: టీఆర్ఎస్ లో మంత్రివర్గ విస్తరణ అసంతృప్తుల నిరసనకు కారణమైంది, మంత్రి పదవి కోసం ఆశలు పెట్టుకొన్న నేతలు పదవులు దక్కని కారణంగా బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కారు., అసంతృప్తులను టీఆర్ఎస్ నాయకత్వం బుజ్జగించింది. మరో వైపు బోదన్ ఎమ్మెల్యే షకీల్ నిజామాబాద్ ఎంపీ అరవింద్ ను కలవడం రాజకీయంగా చర్చకు దారి తీసింది.ఆ తర్వాత షకీల్ యూటర్న్ తీసుకొన్నారు. గత వారం అధికార పార్టీలో రాజకీయాలు హట్ హట్ గా సాగాయి.

ఈ నెల 8వ తేదీన తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేశారు. ఆరుగురికి మంత్రివర్గంలో చోటు కల్పించారు. కేటీఆర్, హరీష్ రావు, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ కుమార్, గంగుల కమలాకర్, సబిత ఇంద్రారెడ్డిలకు మంత్రి పదవులు దక్కాయి.

మంత్రి పదవులు ఆశించిన నేతలు బహిరంగంగానే తమ అభిప్రాయాలను మీడియా ముందుకు వెళ్లగక్కారు. మాజీ మంత్రి జోగు రామన్న,నాయిని నర్సింహ్మరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యలు తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. 

జోగు రామన్న అజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే తన భర్తకు మంత్రి పదవి రాకపోవడంతోనే బీపీ పెరిగిందని ఆయన భార్య చెప్పారు. తనకు ఆరోగ్యం బాగాలేదని అందుకే కార్యకర్తలకు కలవకుండా దూరంగా వెళ్లినట్టుగా జోగు రామన్న ప్రకటించారు. అయితే జోగు రామన్న అదృశ్యం కావడానికి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడమే కారణమనే ప్రచారం జోరుగా సాగింది.

ఈ విషయమై మంత్రి జోగు రామన్న రెండు రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు.అనారోగ్యం కారణంగానే తాను కార్యకర్తలకు దూరంగా ఉన్నానని జోగు రామన్న ప్రకటించారు. ఈ సమయంలో ఆయన  కన్నీటి పర్యంతమయ్యారు.

 

మాజీ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి కూడ మంత్రి పదవి విషయంలో కేసీఆర్ తనను మోసం చేశారని వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి, తన అల్లుడికి ఎమ్మెల్సీ పదవిని ఇస్తానని కేసీఆర్ మాట ఇచ్చి మోసం చేశారని ఆయన చెప్పారు.

ఈ విషయమై నాయిని నర్సింహ్మారెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. మీడియాతో చిట్ చాట్ చేశాను.. కానీ, ఈ విషయమై మీడియాలో పెద్ద పెద్ద వార్తలు రాశారు... అంతే అంటూ నాయిని నర్సింహ్మారెడ్డి కేటీఆర్ కు చెప్పారు. ఈ విషయాన్ని కూడ నాయిని నర్సింహ్మారెడ్డి మీడియాకు చెప్పారు. 

మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య కూడ మంత్రివర్గంలో చోటు విషయంలో అసంతృప్తిని వెళ్లగక్కారు. మాదిగలకు మంత్రివర్గంలో చోటు కల్పించలేదన్నారు. ఆ తర్వాతే రోజునే తన మాటలను మీడియా వక్రీకరించిందని వివరణ ఇచ్చారు.

మరో వైపు తనకు పదవి ఇవ్వకపోతే ఫారిన్ పారిపోతానని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రకటించారు. మంత్రి పదవిపై జీవన్ రెడ్డి కూడ ఆశలు పెట్టుకొన్నారు. మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఏదో ఒక పదవి కావాలని ఆయన కోరుకొన్నారు. కానీ, పదవి దక్కలేదని ఆయన అసంతృప్తికి గురయ్యారు. 

మంత్రివర్గంలో చోటు దక్కనివారిని టీఆర్ఎస్ నాయకత్వం బుజ్జగించింది. అసంతృప్తులకు ఫోన్లు చేసి మాట్లాడారు. అసంతృప్తులు టీఆర్ఎస్ భవన్ లో కేటీఆర్ తో కూడ సమావేశమయ్యారు. ఆ తర్వాత మీడియా తమ మాటలను వక్రీకరించిందని ప్రకటించారు. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య ఏకంగా తాను చేసిన వ్యాఖ్యలకు ఆడియో, వీడియోలు లేవని ప్రకటించడం గమనార్హం.

నిజామాబాద్ జిల్లా బోదన్ ఎమ్మెల్యే షకీల్ ఈ నెల 12వ తేదీన నిజామాబాద్ ఎంపీ అరవింద్ కుమార్ ను కలిశారు. బీజేపీలో షకీల్ చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. మంత్రి పదవి దక్కని కారణంగానే షకీల్ అసంతృప్తి చెందారని ప్రచారంలో ఉంది.అయితే ఈ నెల 13వ తేదీ నాటికి షకీల్ యూటర్న్ తీసుకొన్నారు.తాను బీజేపీలో చేరేది లేదని ప్రకటించారు.


ఆర్ధిక మాంద్యంతో తగ్గిన బడ్జెట్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 9వ తేదీన ప్రారంభమయ్యాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. శాసనమండలిలో ఆర్దిక మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.రూ.1,46,492 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టింది ప్రభుత్వం. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కంటే 2019-20 బడ్జెట్ ను కుదించింది తెలంగాణ ప్రభుత్వం.2019-20 ఆర్ధిక సంవత్సరానికి   రూ.1 లక్ష 46వేల 492 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టింది.

 తెలంగాణ సర్కార్.. ఈ ఏడాది వాస్తవ అంచనాలతో బడ్జెట్ ను ప్రవశపెట్టింది. రెవెన్యూ వ్యయం 1లక్ష 11వేల 055 కోట్లుగా ఉంటుందని అంచాన వేశారు. మూల ధన వ్యయం  17, 274.67 కోట్లుగా అంచాన వేసింది. బడ్జెట్ అంచనాల్లో మిగులు రూ. 2,044.08 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఆర్ధిక లోటు రూ. 24,081.74 కోట్లు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది.

యురేనియంపై పోరాటం

నల్లమలలో యురేనియం తవ్వకాలను నిరసిస్తూ విపక్షాలు పోరాటానికి సిద్దమయ్యాయి. నల్లమలలో యురేనియం తవ్వకాలను నిరసిస్తూ  కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు పోరాట కార్యక్రమానికి సిద్దమయ్యారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ను కలిసి యురేనియం పోరాటంలో పాల్గొనాలని కోరారు. 

యురేనియం వద్దంటూ స్థానిక గిరిజనులు కూడ పోరాటబాట పట్టారు. నాగర్ కర్నూల్ జిల్లాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ కూడ నిర్వహించారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాత్రం యురేనియం తవ్వకాల విషయంలో ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని ప్రకటించారు. విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన విమర్శలు చేశారు.

మరో వైపు యురేనియం పోరాటంలో పాల్గొనడంపై  జనసేనాని కూడ సై అన్నారు. ఈ పోరాటంలో కలిసి పనిచేద్దామని రేవంత్ రెడ్డికి పవన్ కళ్యాణ్ శనివారం నాడు ఫోన్ చేశారు.  యురేనియం ప్రాజెక్టును నిరసిస్తూ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి కూడ పాల్గొనే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

కేసీఆర్ పిలిస్తే వెళ్తా, కేటీఆర్ అడిగారు: నాయిని

ఏదైనా పదవి ఇస్తే చేస్తా.. లేదంటే ఫారిన్ పోతా: టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

ఆ పదవి నేను చేస్తానా: కేసీఆర్‌కి నాయిని నర్సింహారెడ్డి సెగ

మంత్రి ఈటల రాజేందర్ కు షాక్: బిఎసి నుంచి తొలగింపు

ఆ పదవి నేను చేస్తానా: కేసీఆర్‌కి నాయిని నర్సింహారెడ్డి సెగ

ముంచుకొస్తున్న ముప్పు: మంత్రివర్గ విస్తరణపై మారిన కేసీఆర్ ప్లాన్

ఈటలతో నాకు విభేదాలు లేవు: గంగుల

మంత్రి పదవిపై తేల్చేశారా: కేసీఆర్‌తో ఈటల రాజేందర్ భేటీ

కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఉద్వాసన ఎవరికీ

నేడే మంత్రివర్గ విస్తరణ: ఆ ఆరుగురు వీరే....

కేసీఆఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు: కొత్తగా నలుగురే

కేసీఆర్ కేబినెట్: కేటీఆర్, హరీష్‌లలో ఎవరికి చోటు?

దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్‌‌కు చోటు, కారణమదేనా

సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇదే....

హరీష్ కు మంత్రిపదవి: కేసీఆర్ కు తప్పలేదా, వ్యూహమా?

హరీష్‌కు పెద్దపీట: కొత్త మంత్రుల శాఖలివే

కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ: తొలిసారి కేబినెట్‌లోకి

కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ: తొలుత హరీష్, చివరగా పువ్వాడ

టీఆర్ఎస్‌లో ట్రబుల్ షూటర్: రికార్డుల విజేత హరీష్ రావు

భర్త మరణంతో రాజకీయాల్లోకి.. మూడోసారి మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి

టీఆర్ఎస్‌లో కీలకనేతగా కేటీఆర్: మెడిసిన్‌ కాదని ఐటీ వైపు

బీజేపీ దూకుడు: చెక్ పెట్టే దిశగా కేసీఆర్ ప్లాన్ ఇదీ..

బెర్త్ ఖరారైన అభ్యర్థులకు ఫోన్ కాల్స్: హరీష్ ఉన్నా కేసీఆర్ తర్వాత కేటీఆరే

ఈటలతో నాకు విభేదాలు లేవు: గంగుల

మంత్రి పదవిపై తేల్చేశారా: కేసీఆర్‌తో ఈటల రాజేందర్ భేటీ

కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఉద్వాసన ఎవరికీ

నేడే మంత్రివర్గ విస్తరణ: ఆ ఆరుగురు వీరే....

కేసీఆఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు: కొత్తగా నలుగురే

కేసీఆర్ కేబినెట్: కేటీఆర్, హరీష్‌లలో ఎవరికి చోటు?

దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్‌‌కు చోటు, కారణమదేనా

సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇదే....