Asianet News TeluguAsianet News Telugu

సర్దుకుపోదాం, సీట్లపై ఆశలొద్దు: టీటీడీపీ నేతలతో చంద్రబాబు

 డిసెంబర్ 7వ తేదీన  తెలంగాణ అసెంబ్లీకి జరిగే  ఎన్నికల్లో  ప్రజా కూటమి విజయం సాధిస్తోందని  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు  జోస్యం చెప్పారు. 

Tdp chief chandrababunaidu interesting comments on prajakutami
Author
Hyderabad, First Published Oct 22, 2018, 1:32 PM IST

హైదరాబాద్: డిసెంబర్ 7వ తేదీన  తెలంగాణ అసెంబ్లీకి జరిగే  ఎన్నికల్లో  ప్రజా కూటమి విజయం సాధిస్తోందని  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు  జోస్యం చెప్పారు. సీట్లు రాని నాయకులకు న్యాయం చేస్తామని చంద్రబాబునాయుడు  హామీ ఇచ్చారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో టీడీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన పొలిట్‌బ్యూరో సభ్యులు, సెంట్రల్ కమిటీ సమావేశంలో చంద్రబాబునాయుడు  కీలక వ్యాఖ్యలు చేశారు. గెలిచే  స్థానాలను వదులుకోవద్దని  చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు.

మహా కూటమి(ప్రజా కూటమి) సీట్ల సర్దుబాటు విషయంలో పార్టీ నేతలకు చంద్రబాబునాయుడు  కీలక సూచనలను చేశారు.  ఎక్కువ సీట్లు కోరడం కంటే  గెలిచే సీట్లను  కోరడమే ముఖ్యమని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు.

2009 ఎన్నికల్లో తెలంగాణలో  ఆనాడు టీఆర్ఎస్ 45 సీట్లలో పోటీ చేస్తే ఎన్ని సీట్లలో విజయం సాధించిందో చంద్రబాబునాయుడు ఈ సమావేశంలో గుర్తు చేశారు.  కూటమి విజయం ముఖ్యంగా ఉండాలని పార్టీ నేతలకు బాబు తుర్తు చేశారు.  సీట్ల సర్ధుబాటు విషయంలో  ఆచితూచి వ్యవహరించాలని బాబు సూచించారు.

బలంగా ఉన్న స్థానాల్లోనే పోటీ చేయాలని పార్టీ నేతలను  దిశా నిర్దేశం చేశారు. ప్రజా కూటమి  అధికారంలోకి వస్తే  నామినేటేడ్ పదవులను కట్టబెడతామని బాబు పార్టీ నేతలకు హామీ ఇచ్చారు.

సీట్లు రాని చోట ప్రజా కూటమి అభ్యర్థుల విజయం కోసం పనిచేయాలని చంద్రబాబునాయుడు పార్టీ  నేతలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ కనీసం 15 సీట్లు ఇచ్చేందుకు  సానుకూలంగా సంకేతాలను ఇచ్చింది. అయితే మరో 6 సీట్లను కోరాలని  చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించినట్టు సమాచారం ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ స్థానాలను కూడ బాబు పార్టీ నేతలను ఆదేశించారు.


టీడీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు  ఎల్. రమణ‌తో పాటు పార్టీ నేతలను చంద్రబాబునాయుడు అభినందించారు.  ప్రజా కూటమి ఏర్పాటుతో పాటు ఇతర పార్టీలతో  సమన్వయంతో  ముందుకు వెళ్లడాన్ని బాబు అభినందించారు. 

ఎక్కువ సీట్లు వస్తాయనే ఆశలు పెట్టుకోకూడదనే సంకేతాలను ఈ సమావేశంలో చంద్రబాబునాయుడు ఇచ్చారు. సీట్ల సర్ధుబాటు విషయాన్ని ఎల్. రమణ, నామా నాగేశ్వర్‌లకు చంద్రబాబునాయుడు కట్టబెట్టారు.

తెలంగాణ నేతలకు అండగా ఉంటానని... టచ్‌లోనే ఉంటానని బాబు ఈ సమావేశంలో హామీ ఇచ్చారు. తెలంగాణకు చెందిన నేతలకు  న్యాయం చేసే బాధ్యత ఎల్. రమణ,  నామా నాగేశ్వర్‌రావులదేనని చంద్రబాబునాయుడు ఈ సమావేశంలో చమత్కరించారని తెలుస్తోంది ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కనబర్చిన నేతల నుండి చంద్రబాబునాయుడు స్వయంగా బయోడేటాలను  తీసుకొన్నారు.

సంబంధిత వార్తలు

ఆ సీట్లు వదులుకోవద్దు: తెలంగాణ నేతలకు బాబు సూచన

ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?

 

Follow Us:
Download App:
  • android
  • ios