Asianet News TeluguAsianet News Telugu

ఆ సీట్లు వదులుకోవద్దు: తెలంగాణ నేతలకు బాబు సూచన

పార్టీకి బలం ఉన్న  స్థానాలను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని  టీడీపీ నేతలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సూచించారు. 

don't lose those key seats says chandrababu naidu
Author
Hyderabad, First Published Oct 22, 2018, 12:10 PM IST

హైదరాబాద్:పార్టీకి బలం ఉన్న  స్థానాలను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని  టీడీపీ నేతలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సూచించారు. కాంగ్రెస్ పార్టీ  కేవలం 15 సీట్లు ఇచ్చేందుకు సానుకూల సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం.

సోమవారం నాడు హైద్రాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో చంద్రబాబునాయుడు టీడీపీ తెలంగాణ పొలిట్ బ్యూరో, సెంట్రల్ కమిటీ సభ్యులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణలో  అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించారు.

2014 ఎన్నికల సమయంలో  టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు ఉంది. దీంతో 72 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ, 45 స్థానాల్లో బీజేపీ పోటీ చేసింది.అయితే  టీడీపీ 15 అసెంబ్లీ, 1 ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకొంది. బీజేపీ 5 అసెంబ్లీ, 1 ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకొంది.

నాలుగున్నర ఏళ్లలో రాజకీయ పరిస్థితులు మారిన నేపథ్యంలో  మహా కూటమి( ప్రజా కూటమి) పేరుతో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు పోటీచేయాలని నిర్ణయం తీసుకొన్నాయి.ఈ పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు ఇంకా పూర్తి కాలేదు.

ఈ ఎన్నికల్లో కనీసం 20 స్థానాల కోసం టీడీపీ పట్టుబడుతోంది.కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం 15 సీట్లుఇచ్చేందుకు సానుకూలంగా స్పందించింది. టీడీపీ తెలంగాణ పొలిట్‌బ్యూరో సభ్యులతో  సమావేశమైన  చంద్రబాబునాయుడు సీట్ల సర్ధుబాటు, ఏఏ స్థానాల్లో పోటీ చేయాలనే విషయమై చర్చించారు. 

కాంగ్రెస్ పార్టీ 15 సీట్లు ఇస్తే  ఏ ఏ స్థానాలను కోరాలనే దానిపై  చర్చించారు. పార్టీ బలంగా ఉన్న స్థానాలను మాత్రం వదులుకోకూడదని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు. ఒకే సీటును  రెండు పార్టీలు కోరితే  ఏం చేయాలనే దానిపై కూడ చర్చించారు. మహా కూటమిలోని పార్టీల మధ్య పోటీ లేకుండా చూసుకోవాలని పార్టీ నేతలకు బాబు సూచించారు.

పొలిట్‌బ్యూరో‌తో పాటు, పార్టీ సెంట్రల్ కమిటీతో చంద్రబాబునాయుడు వేర్వేరుగా  చర్చించారు. మరోవైపు ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఇప్పటికే చంద్రబాబునాయుడుకు ఆ పార్టీ నేతలు ఇచ్చారు. పోటీకి సిద్దంగా ఉన్న నేతలతో చంద్రబాబునాయుడు  నేరుగా చర్చించే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?

Follow Us:
Download App:
  • android
  • ios