అందమైన అమ్మాయితో స్నేహం చేశాడు. కొద్ది రోజుల తర్వాత ప్రేమిస్తున్నానంటూ మాయ మాటలు చెప్పాడు. పెళ్లి చేసుకోకుంటే చచ్చిపోతానని బెదిరించాడు. ఆమె అంగీకారం కూడా తీసుకోకుండా కర్ణాటక తీసుకువెళ్లి... బలవంతంగా ఆమె నుదిటిన కుంకుమ పెట్టి... పెళ్లి అయిపోయిందని చెప్పాడు.

ఆ తర్వాత ఆమె ఫోటోలను ఆన్ లైన్ లో కాల్ గర్ల్ పేరిట పెట్టి డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. ఆలస్యంగా నిజం తెలుసుకున్న యువతి మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

Also Read సిద్ధిపేటలో కాల్పుల కలకలం.. ఏకే47 తుపాకీతో కాల్చి..

పూర్తి వివరాల్లోకి వెళ్లితే అంబర్ పేటకు చెందిన ఓ యువతి ని నగరానికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరిట ముగ్గులోకి దింపాడు. పెళ్లి చేసుకోవాలంటూ బలవంతంగా బెంగూళురు తీసుకువెళ్లి పెళ్లాడాడు. ఎలాగూ పెళ్లి అయిపోయింది కదా.. అని ఆమె అతనితోనే ఉండటం మొదలుపెట్టింది. అయితే.. ఎలాంటి సంపాదన లేకుండా ఇంట్లో కూర్చుని తిని, తాగుతుండటంతో అతనిని భార్య నిలదీసింది.

దీంతో డబ్బు సంపాదిస్తానంటూ చెప్పాడు. ఆ తర్వాత భార్య ఫోటోలను సోషల్ మీడియాలో కాల్ గర్ల్ పేరిట పోస్టు చేశాడు. అనంతరం సెక్సీ ఛాట్ అంటూ కొంతకాలాం భార్య పేరిట అతనే చేసేవాడు. అలా చేసినందుకు వారి వద్ద నుంచి డబ్బులు తీసుకునేవాడు. నెలకోసారి ఫోన్ నెంబర్లు మారుస్తూ ఉండేవాడు. అంతేకాకుండా సోషల్ మీడియ ఎకౌంట్స్ కూడా మార్చేవాడు.

కొన్ని సార్లు స్నేహితులు అని చెప్పి విఠులను ఇంటికి తీసుకువచ్చేవాడు. వాళ్లను భార్య దగ్గర వదిలేసి ఇంట్లో నుంచి బయటకు వెళ్లేవాడు.  సంవత్సరంపాటు ఆమెను అలానే వేధించాడు. అయితే కొన్ని సార్లు ఆమె విఠులకు దొరకకుండా పారిపోయేది. మోసపోయామంటూ ఆ విఠులు.. భర్త శాడిజం తట్టుకోలేక భార్య పోలీసులను ఆశ్రయించడంతో... అన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

తన ఫోటోతో సోషల్ మీడియాలో భర్త చేసిన దారుణాలు తెలుసుకొని ఆమె అవాక్కయ్యింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.