సిద్ధిపేటలో కాల్పుల కలకలం రేగింది. హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలం కేంద్రంలో... ఓ చిన్న గొడవ తుపాకీతో కాల్చుకునేదాకా దారితీసింది. ఏకే 47తో రెండు రౌండ్లు కాల్పులు జరగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. గుంటి గంగా రాజు అనే వ్యక్తిపై దేవుని సదానందం అనే వ్యక్తి ఈ కాల్పులు జరిపాడు. మిస్ ఫైర్ కావడంతో గంగరాజుకు ప్రాణాపాయం తప్పింది.

Also Read భార్యను పంపడంలేదని కాల్పులు.. నిందితులు అరెస్ట్, నక్సెల్స్ తో సంబంధం.
 
ప్రస్తుతం సదానందం పరారీలో ఉన్నాడు. సిద్దిపేట, హుస్నాబాద్ ఏసీపీలు, క్లూస్ టీం సహాయంతో సదానందం ఇంటిని తనిఖీ చేశారు. పేలిన తూటాలను స్వాధీనం చేసుకున్నారు. తల్వార్ కత్తి, తుపాకి బెల్ట్, బాడిషా కత్తి, రెండు ఫోన్లు, రెండు బ్యాంక్ అకౌంట్ల ఏటీఎంలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అర్థరాత్రి నుంచి అక్కన్నపేట పోలీసుల ఆధీనంలో ఉంది.